Sunday, December 29, 2024

PPF Scheme: కోటీశ్వరుల్ని చేసే కేంద్రం స్కీమ్.. ట్రిపుల్ టాక్స్ బెనిఫిట్స్.. నెలకు ఎంత కడితే ఎంతొస్తుంది?

PPF Calculator: దీర్ఘకాలంలో మంచి రిటర్న్స్ రావడం సహా పెద్ద మొత్తంలో పన్ను ఆదా చేసుకునేందుకు అందుబాటులో ఉన్న అద్భుత పథకం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. ఇదే పీపీఎఫ్. దీనికి అత్యంత డిమాండ్ ఉంటుంది. ఇందులో అత్యంత గొప్ప పన్ను ప్రయోజనాలు ఉన్నాయి. దీంట్లో మీ పెట్టుబడులపై, వడ్డీ రాబడిపై, మెచ్యూరిటీ రిటర్న్స్‌పై ఎలాంటి టాక్స్ పడదని గుర్తుంచుకోవాలి. ఇంకా ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80c కింద పాత పన్ను విధానంలో ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ. 1.50 లక్షల వరకు టాక్స్ ఆదా చేసుకోవచ్చు. అందుకే ఇందులో ఎక్కువగా పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఇంకా ప్రభుత్వం నుంచి మద్దతు ఉంటుంది కాబట్టి ఎలాంటి రిస్క్ లేకుండా నిర్ణీత సమయంలో గ్యారెంటీ రిటర్న్స్ అందుకోవచ్చు.

ఈ పథకం విషయానికి వస్తే.. వరుసగా 15 సంవత్సరాలు ఇందులో డిపాజిట్లు చేయాల్సి ఉంటుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ బెనిఫిట్ పొందొచ్చు. ఈ పథకంలో వడ్డీ రేటు ప్రస్తుతం వార్షిక ప్రాతిపదికన 7.10 శాతంగా ఉంది. ఇక ఏడాదిలో కనీసం రూ. 500 నుంచి గరిష్టంగా రూ. 1.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టొచ్చు. ఎవరైనా అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. మైనర్ పేరిట గార్డియెన్ ఖాతా తెరవొచ్చు

ఇక పెట్టుబడిని ఇందులో ఆర్థిక సంవత్సరంలో ఒకేసారి లేదా ఇన్‌స్టాల్‌మెంట్లలో చెల్లించేందుకు వెసులుబాటు ఉంటుంది. అకౌంట్ తెరిచిన రెండేళ్లకు ఇందులో డిపాజిట్లపై లోన్లు తీసుకోవచ్చు. ముందస్తు విత్‌డ్రాకు కూడా అవకాశం ఉంటుంది. వడ్డీ రేట్లు ప్రతి 3 నెలలకు ఓసారి మారే అవకాశం ఉంటుంది. కేంద్రం ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంటుందని చెప్పొచ్చు. వడ్డీ రేట్లు పెరగొచ్చు లేదా తగ్గొచ్చు లేదా స్థిరంగా కూడా ఉండొచ్చు. ఇక అకౌంట్‌ను 15 ఏళ్ల తర్వాత ఐదేళ్ల చొప్పున పొడిగించూకుంటూ వెళ్లొచ్చు. ఇలా పెద్ద మొత్తంలో లాభాలు పొందొచ్చు.

ఇందులో మనం ఇప్పుడు నెలకు రూ. 10 వేల చొప్పున ఏటా రూ. 1.20 లక్షల చొప్పున ఇన్వెస్ట్ చేస్తే 15 సంవత్సరాల్లో ప్రస్తుత 7.10 శాతం వడ్డీ రేటు ప్రకారం.. మీ పెట్టుబడి రూ. 18 లక్షలు కాగా.. వడ్డీతోనే రూ. 14.54 లక్షలు వస్తాయి. మొత్తం చేతికి రూ. 32.54 లక్షలు అందుతాయన్నమాట. ఇక్కడ మరో ఐదేళ్లు పొడిగిస్తే అప్పుడు చేతికి రూ. 53.26 లక్షలు అందుతాయి. మరో ఐదేళ్లు ఇలాగే చేస్తే అప్పుడు 25 ఏళ్లలో చేతికి రూ. 82,46,412 వస్తుంది.

ఇదే సమయంలో గరిష్ట పెట్టుబడి అయిన రూ. 1.50 లక్షలతో 15 ఏళ్లకు రూ. 40 లక్షలకుపైగా అందుతుంది. 20 ఏళ్లకు రూ. 66 లక్షలు, 25 ఏళ్లకు రూ. 1.03 కోట్లు వస్తాయని చెప్పొచ్చు. చిన్న మొత్తాల్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. నెలకు రూ. 5 వేల చొప్పున ఏటా రూ. 60 వేలతో అయితే 15 ఏళ్లకు రూ. 16 లక్షలు వస్తాయి. 20 ఏళ్లకు రూ. 26 లక్షలు, 25 ఏళ్లకు రూ. 41 లక్షలు అందుతాయి.

పన్ను శ్లాబుల్లో మార్పులు.. స్టాండర్డ్ డిడక్షన్ పెంపు సహా ఏడాదిలో ఎన్నో మార్పులు.. ఇవన్నీ తెలుసుకోండి మరి!

Standard Deduction Hike: 2024 సంవత్సరం కొద్ది రోజుల్లో ముగుస్తోంది. అయితే ఈ ఏడాదిలో ఎన్నో మార్పులొచ్చాయి. ముఖ్యంగా ఆర్థిక పర నిర్ణయాల్లో ఎక్కువగా మార్పులు గమనించొచ్చు. కొద్ది రోజుల కిందట యూపీఐ మార్పుల గురించి తెలుసుకున్నాం. దీని గురించి ఇక్కడ తెలుసుకోండి. ఇప్పుడు మనం 2024 సంవత్సరంలో వచ్చిన ఆదాయపు పన్ను మార్పుల గురించి చూద్దాం. 2024 బడ్జెట్‌ సమయంలో వేతన జీవులకు స్వల్ప ఊరటనిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. పాత పన్ను విధానాన్ని అస్సలు టచ్ చేయకుండా.. కొత్త పన్ను వేతనంలో పలు కీలక మార్పులు చేసింది. పన్ను శ్లాబుల్లో మధ్యతరగతికి కాస్త ఊరట కలిగేలా మార్పులు చేసింది. ఇంకా స్టాండర్డ్ డిడక్షన్ కూడా కొత్త పన్ను విధానంలోనే పెంచడం విశేషం. వీటిల్లో చాలా వరకు పన్ను చెల్లింపుదారులు మర్చిపోయే అవకాశం ఉంది. అందుకే 2024లో ఏమేం మారాయో ఒకసారి చూద్దాం. వచ్చే ఏడాది ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ సమయంలో ఇది ఉపయోగపడనుంది.>> బడ్జెట్‌లో ప్రతిపాదించిన మార్పుల ప్రకారం.. కొత్త పన్ను విధానంలో పన్ను శ్లాబులు మారాయి. రూ. 3 లక్షల వరకు ఎలాంటి పన్ను లేదు. ఇక గతంలో రూ. 3-6 లక్షలపై 5 శాతం పన్ను ఉండగా.. ఇప్పుడు ఈ ఇన్‌కం బ్రాకెట్‌ను రూ. 3-7 లక్షలకు చేర్చిన సంగతి తెలిసిందే. అంటే ఇక్కడ రూ. 7 లక్షల వరకు ఆదాయంపైనా 5 శాతం పన్నే ఉంటుంది. రూ. 6-9 లక్షల శ్లాబుకు 10 శాతంగా ఉండగా.. దీనిని రూ. 7-10 లక్షలకు సవరించింది. ఇప్పుడు రూ. 10 లక్షల వార్షికాదాయం ఉన్న వారు కూడా 10 శాతం పన్ను పరిధిలోకే రానున్నారు. పాత విధానంలో ఈ మార్పులేం లేవు. రూ. 10-12 లక్షల ఆదాయవర్గానికి 15 శాతం పన్ను ఉంటుంది. 12-15 లక్షల మధ్య ఆదాయం ఉంటే 20 శాతం టాక్స్ చెల్లించాలి. ఆపైన ఉంటే 30 శాతం టాక్స్ పరిధిలోకి వెళ్తారు.

స్టాండర్డ్ డిడక్షన్‌ను కొత్త పన్ను విధానంలో రూ. 50 వేల నుంచి ఇప్పుడు రూ. 75 వేలకు పెంచింది. పాత పన్ను విధానంలో అస్సలు మార్చలేదు. ఇక్కడ ఇది రూ. 50 వేలుగానే ఉంది. ఫ్యామిలీ పెన్షనర్లకు రూ. 15 వేల నుంచి రూ. 25 వేలకు పెంచింది ప్రభుత్వం.
వ్యవసాయేతర స్థిరాస్తి క్రయవిక్రయ ట్రాన్సాక్షన్స్‌లో వాస్తవ ధర, స్టాంప్ డ్యూటీల్లో ఏది ఎక్కువ ఉంటే దానిని పరిగణనలోకి తీసుకొని ఒక శాతం మూలం వద్ద పన్ను కోత (TDS) విధించాలని స్పష్టం చేసింది. రూ. 50 లక్షలకు మించి విలువ ఉన్నప్పుడు ఇది వర్తిస్తుంది.

ఆదాయపు పన్ను వివాదాలకు సంబంధించినటువంటి పరిష్కారాల కోసం వివాద్ సే విశ్వాస్ స్కీంను 2020లో కేంద్రం తీసుకొచ్చింది. దీనిని కొనసాగింపుగా బడ్జెట్‌లో వివాద్ సే విశ్వాస్ 2.0 ను ప్రభుత్వం ప్రతిపాదించింది.
మరోవైపు పాన్ కార్డు దరఖాస్తు, టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసే సమయంలో ఆధార్ నంబర్, ఎన్‌రోల్‌మెంట్ ఐడీ రెండింట్లో ఏదో ఒకటి సరిపోయేది. ఇక మీదట కేవలం ఆధార్ సంఖ్యను మాత్రమే వినియోగించాలి.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన బాండ్లపై వచ్చిన వడ్డీకి మూలం వద్ద పన్ను కోత (TDS) 10 శాతం వర్తిస్తుంది.
కంపెనీ షేర్ల బైబ్యాక్ చేసినప్పుడు .. ఇప్పటివరకు సంస్థలకు పన్ను బాధ్యత ఉండేది. ఇప్పుడు మాత్రం ఇది వాటాదారులకు బదిలీ అయిందని గుర్తుంచుకోవాలి. అంటే డివిడెండ్ల తరహాలోనే షేర్ల బైబ్యాక్ సమయంలో కూడా పన్ను వర్తిస్తుంది.
ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్‌లో (F&O) కాంట్రాక్టును విక్రయిస్తే .. ఆప్షన్ ప్రీమియంపై STT- సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ టాక్స్ 0.0625 శాతం నుంచి 0.1 శాతానికి పెరగనుంది. ఫ్యూచర్స్ ట్రేడింగ్‌పై ఇది 0.02 శాతంగా ఉంది.

Thursday, December 12, 2024

Indian Coast Guard: ఇండియన్ కోస్ట్ గార్డులో అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులు - దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా

Indian Coast Guard Notification: భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ కోస్ట్ గార్డు... వివిధ విభాగాల్లో గ్రూప్-ఎ గెజిటెడ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించి 2026 బ్యాచ్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 140 అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులను భర్తీచేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు డిసెంబర్‌ 24లోగా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఐదు దశల పరీక్షలు, ధ్రువపత్రాల ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.

వివరాలు..

* గ్రూప్-ఎ గెజిటెడ్ ఆఫీసర్ పోస్టులు
ఖాళీల సంఖ్య: 140 

పోస్టుల కేటాయింపు: యూఆర్‌-55,ఈడబ్ల్యూఎస్‌-04, ఎస్సీ-17, ఎస్టీ-17, ఓబీసీ-47.

విభాగాలవారీగా ఖాళీలు:

1) జనరల్ డ్యూటీ (జీడీ): 110 పోస్టులు 

2) టెక్నికల్ (మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్): 30 పోస్టులు

అర్హత: విభాగాన్ని అనుసరించి పన్నెండో తరగతి(ఫిజిక్స్‌/ మ్యాథ్స్‌), డిగ్రీ, ఇంజినీరింగ్ డిగ్రీ (నేవల్ ఆర్కిటెక్చర్/ మెకానికల్/ మెరైన్/ ఆటోమోటివ్/ మెకాట్రానిక్స్/ ఇండస్ట్రియల్ అండ్‌ ప్రొడక్షన్/ మెటలర్జీ/ డిజైన్/ ఏరోనాటికల్/ ఏరోస్పేస్) ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.

వయోపరిమితి: 01.07.2025 నాటికి 21-25 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు అయిదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల వరకు సడలింపు ఉంటుంది.

పరీక్ష ఫీజు: రూ.300. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు మినహాయింపు వర్తిస్తుంది. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి. 

ఎంపిక విధానం: స్టేజ్-1, స్టేజ్-2, స్టేజ్-3, స్టేజ్-4, స్టేజ్-5 పరీక్షలు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

జీతం: నెలకు రూ.56,100 చెల్లిస్తారు.


* పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత మార్కుల షీట్లు

* ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత మార్కుల షీట్, సర్టిఫికేట్ లేదా డిప్లొమా సర్టిఫికేట్ (సెమిస్టర్ల వారీగా)

* డిగ్రీ లేదా పీజీ విద్యార్హత మార్కుల షీట్, సర్టిఫికేట్ (సెమిస్టర్/సంవత్సరాల వారీగా)

* డిగ్రీ ఒరిజినల్/ ప్రొవిజినల్ సర్టిఫికేట్ 

* ఒకవేళ సంబంధిత విద్యార్హత చివరిసంవత్సరం లేదా సెమిస్టర్‌కు సంబంధించిన సర్టిఫికేట్లు

* కులధ్రువీకరణ పత్రం (కేటగిరీ సర్టిఫికేట్ - అవసరమైనవారికి)

*  ప్రభుత్వ ఉద్యోగులైతే.. పనిచేస్తున్న సంస్థ యాజమాన్యం నుంచి 'NOC' తీసుకోవాలి. 

ముఖ్యమైన తేదీలు..

* ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 05.12.2024.

* ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 24.12.2024.

* స్టేజ్-1 పరీక్ష తేదీ: 25.02.2025.


Wednesday, December 4, 2024

నేషనల్ సీడ్స్‌ కార్పొరేషన్‌లో 188 ఉద్యోగాలు.. పోస్టులను బట్టి గరిష్టంగా రూ.1,41,260 వరకు జీతం.. పూర్తి వివరాలివే

NSCL Recruitment 2024 : ఇటీవల పలు కేంద్ర ప్రభుత్వ సంస్థలు వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇటీవల ఢిల్లీలోని మినీరత్న కంపెనీ- నేషనల్ సీడ్స్‌ కార్పొరేషన్ లిమిటెడ్ (NSCL).. భారీ జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా డైరెక్ట్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న 188 పోస్టులను భర్తీ చేయనుంది. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు డిసెంబర్‌ 8వ తేదీ వరకు ఆన్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవచ్చు. కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు డిసెంబర్‌ 22వ తేదీన రాత పరీక్ష నిర్వహించనున్నారు. అభ్యర్థులు పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ చూడొచ్చు.

మొత్తం ఖాళీల సంఖ్య: 188
డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టులు : 01
అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు : 01
మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు : 05
సీనియర్ ట్రైనీ పోస్టులు : 02
ట్రైనీ పోస్టులు : 179

ట్రైనీ ఖాళీలు భర్తీ చేయనున్న విభాగాలు: విజిలెన్స్‌, హెచ్‌ఆర్, క్వాలిటీ కంట్రోల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, అగ్రికల్చర్‌, మార్కెటింగ్, అకౌంట్స్‌, స్టెనోగ్రాఫర్‌, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, డీజిల్, మెకానిక్, బ్లాక్‌స్మిత్ తదితర విభాగాల్లో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు పూర్తి వివరాలను అధికారిక నోటిఫికేషన్‌లో చూడొచ్చు.

ఇతర ముఖ్యమైన సమాచారం :

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, ఎల్ఎల్‌బీ, బీఈ/బీటెక్, ఎంబీఏ/పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

జీతం: నెలకు డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టులకు రూ.1,41,260.. అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు రూ.80,720.. మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులకు రూ.57,920.. సీనియర్ ట్రైనీ పోస్టులకు రూ.31,856.. ట్రైనీ పోస్టులకు రూ.24,616 చెల్లిస్తారు.

వయోపరిమితి: డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టులకు 50 ఏళ్లు.. అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు 30 ఏళ్లు.. మిగతా పోస్టులకు 27 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు.. ఓబీసీలకు మూడేళ్లు.. పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేళ్ల వయో సడలింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు: రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభ తేదీ: నవంబర్‌ 26, 2024
ఆన్‌లైన్‌ దరఖాస్తులు చివరి తేదీ: డిసెంబర్‌ 8, 2024
కంప్యూటర్ ఆధారిత పరీక్ష: డిసెంబర్‌ 22, 2024

కర్ణాటక బ్యాంక్‌ ప్రొబేషనరీ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. నోటిఫికేషన్‌ విడుదల.. ఏపీ, తెలంగాణలోనూ ఖాళీలు

Karnataka Bank PO Recruitment 2024 : బ్యాంక్‌ ఉద్యోగాలు ఎప్పటికీ క్రేజీ జాబ్సే. ఎప్పుడూ కొన్ని లక్షల మంది అభ్యర్థులు సన్నద్ధమవుతుంటారు. అయితే.. తాజాగా మంగళూరులోని కర్ణాటక బ్యాంకు లిమిటెడ్‌ (Karnataka Bank Ltd) ప్రధాన కార్యాలయం జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా కేబీఎల్‌ శాఖలు/ కార్యాలయాల్లో ప్రొబేషనరీ ఆఫీసర్ (Probationary Officer) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వ్యవసాయ డిగ్రీ లేదా పీజీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లయ్‌ చేసుకోవచ్చు. డిసెంబర్‌ 10వ తేదీలోగా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా ఈ పీఓ నియామకాలు ఉంటాయి. డిసెంబర్‌ 22వ తేదీ ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన రాత పరీక్ష నిర్వహించనున్నారు. అభ్యర్థులు పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ చూడొచ్చు. అలాగే.. అప్లయ్‌ చేసుకోవడానికి ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ లింక్‌ ఇదే.

ఇతర ముఖ్యమైన సమాచారం :

రిక్రూట్‌మెంట్‌ : ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులు

అర్హత: ఏదైనా విభాగంలో పీజీ లేదా అగ్రికల్చరల్ సైన్స్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ లేదా ఐదేళ్ల లా డిగ్రీ సీఏ, సీఎస్‌, సీఎంఏ, ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 01.11.2024 నాటికి గరిష్ఠంగా 28 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు వయోపరిమితిలో ఐదేళ్ల సడలింపు ఉంటుంది.

పే స్కేల్: నెలకు రూ.48,480 నుంచి రూ.85,920 వరకు వేతనం ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ టెస్ట్/ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

పరీక్ష కేంద్రాలు: బెంగళూరు, చెన్నై, ముంబయి, న్యూదిల్లీ, హైదరాబాద్, కోల్‌కతా, పుణె, మంగళూరు, ధార్వాడ్/ హుబ్బల్లి, మైసూరు, శివమొగ్గ, కలబురగి కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు.

దరఖాస్తు ఫీజు: రూ.800 చెల్లించాల్సి ఉంటుంది (ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు రూ.700 ఉంటుంది).

దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు :

నోటిఫికేషన్ విడుదల తేదీ: నవంబర్‌ 30, 2024

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్/ ఫీజు చెల్లింపు ప్రారంభ తేది: నవంబర్‌ 30, 2024

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్/ ఫీజు చెల్లింపు ముగింపు తేదీ: డిసెంబర్‌ 10, 2024

ఆన్‌లైన్ పరీక్ష పరీక్ష తేదీ: డిసెంబర్‌ 22, 2024

Sunday, December 1, 2024

BSF Constable: బీఎస్ఎఫ్ 275 కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ)

BSF Constable: బీఎస్ఎఫ్ 275 కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ)

పోస్టులు

హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) ... స్పోర్ట్స్ కోటాలో 275 కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) గ్రూప్-సి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 30వ తేదీలోగా ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
ఖాళీల వివరాలు.

కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) నాన్-గెజిటెడ్ అండ్ నాన్ మినిస్టీరియల్ (స్పోర్ట్స్ కోటా): 275 పోస్టులు

క్రీడాంశాలు: ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, స్విమ్మింగ్, డైవింగ్, వాటర్ పోలో, బాస్కెట్బాల్, బాక్సింగ్, సైక్లింగ్, క్రాస్ కంట్రీ, ఈక్వెస్ట్రియన్, ఫుట్బాల్, జిమ్నాస్టిక్స్, హ్యాండ్బాల్, హాకీ, ఐన్-స్కీయింగ్, జూడో, కరాటే, వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్, వాటర్ స్పోర్ట్స్, రెజ్లింగ్, షూటింగ్ టైక్వాండో, వుషు, ఫెన్సింగ్.

అర్హత: మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణతతో పాటు నేషనల్/ ఇంటర్నేషనల్ ఈవెంట్స్లో సంబంధిత క్రీడాంశాల్లో పాల్గొని ఉండాలి లేదా విజయాలు సాధించి ఉండాలి.

వయోపరిమితి: 01 జనవరి 2025 నాటికి 18 నుంచి 23 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: అప్లికేషన్స్ షార్టస్టింగ్, ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ (పీఎన్జీ), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

దరఖాస్తు రుసుము: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.147.20. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.


ముఖ్య తేదీలు...

ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: 01-12-2024.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 30-12-2024.

ముఖ్యాంశాలు:

స్పోర్ట్స్ కోటాలో 275 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 30వ తేదీలోగా ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

PGCIL: PGCIL ట్రైనీ ఇంజినీర్ పోస్టులు

గురుగ్రామ్లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ- పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్- దేశ వ్యాప్తంగా పీజీసీఐఎల్ రీజియన్/ కార్యాలయాల్లో ట్రైనీ ఇంజినీర్ ఖాళీల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇంజినీరింగ్ డిగ్రీ అర్హత గల అభ్యర్థులు డిసెంబర్ 19వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు:

* ట్రైనీ ఇంజినీర్ (ఎలక్ట్రానిక్స్): 22 పోస్టులు

విభాగాలు: ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్/ టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్.

అర్హత: కనీసం 60% మార్కులతో ఎలక్ట్రానిక్స్ విభాగంలో ఫుల్ టైం బీఈ, బీటెక్/ బీఎస్సీ (ఇంజినీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి. గేట్-2024 స్కోరు తప్పనిసరి.

గరిష్ఠ వయో పరిమితి: 19.12.2024 నాటికి 28 సంవత్సరాలు మించకూడదు.

పే స్కేల్:  .30,000 నుండి 1,20,000.

ఎంపిక ప్రక్రియ: గేట్ 2024 స్కోర్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ల వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా.

దరఖాస్తు రుసుము: రూ.500. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: 29.11.2024.

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 19.12.2024



PPF Scheme: కోటీశ్వరుల్ని చేసే కేంద్రం స్కీమ్.. ట్రిపుల్ టాక్స్ బెనిఫిట్స్.. నెలకు ఎంత కడితే ఎంతొస్తుంది?

PPF Calculator: దీర్ఘకాలంలో మంచి రిటర్న్స్ రావడం సహా పెద్ద మొత్తంలో పన్ను ఆదా చేసుకునేందుకు అందుబాటులో ఉన్న అద్భుత పథకం పబ్లిక్ ప్రావిడెంట్ ...